గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పందుల విహారం.
గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో, ఇంకా రెండవ అంతస్తు మీద పందుల సంచారం కనిపించింది. పందుల విహారం రోగులకు, ప్రమాదకరం అయినప్పటికీ, ఆసుపత్రి సిబ్బంది, అధికారులు ఏమాత్రం ఈ అంశం పై దృష్టి సారించడంలేదని, ప్రజలు వాపోతున్నారు.
ఆపరేషన్ థియేటర్ గదుల ముందు కూడా యధేచ్చగా తిరుగుతున్న పందులను చూసి, ఇక్కడికి చికిత్స కోసం రావడానికి ప్రజలు జంకుతున్నారు.