బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఝున్‌ఝున్‌వాలా అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు.
ఆయన ఆస్తి విలువ రూ.35వేల కోట్లు. దీంట్లో సింహ భాగం స్టాక్ మార్కెట్ ద్వారానే సంపాదించారు. ‘వారెన్ బఫేట్ ఆఫ్ ఇండియా’ అని కూడా ఝున్‌ఝున్‌వాలాను పిలుస్తుంటారు.