Ramagundam: Best Police Stations

తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ లుగా అవార్డును అందుకున్న రామగుండం, భీమారం, జైపూర్, సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లు

2021 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి యూనిట్‌ నుండి అన్ని విభాగాలలో పోలీస్‌ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు, ఖచ్చితమైన విశ్లేషణ, నేరాల నివారణ, సమర్థవంతమైన విచారణ, ప్రోయాక్టివ్ పోలీసింగ్, 5S ఇంప్లిమెంట్, వర్టికల్ పెర్ఫార్మన్స్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మొదలైన రక్షణ క్రియాత్మక రంగాలలో వారు సాధించిన ప్రతిభ ఆధారంగా పలు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు కేటగిరీలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ లోని రామగుండం పోలీస్‌ స్టేషన్‌ కేటగిరి -2(151 – 220), మంచిర్యాల జోన్ నందు భీమారం పోలీస్‌ స్టేషన్‌ కేటగిరి -1(0 – 150), జైపూర్ పోలీస్‌ స్టేషన్‌ కేటగిరి -3(221 – 350), సిసిసి నస్పూర్ పోలీస్‌ స్టేషన్‌ కేటగిరి -4( 350 &above) లలో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును దక్కించుకున్నాయి.

రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌ లుగా ఎంపికయ్యే విధంగా పని చేసిన ఏసీపీ, సీఐ, పోలీస్ స్టేషన్ SHO అధికారులను, పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ అభినందించారు.