Secrets of Universe: God must be there

ఏమో, దేవుడు ఉండావచ్చును!

ఈ సమస్త సృష్టే ఓ ప్రళయం

ఈ సృష్టే ఓ ప్రళయం! దాని సంభవమే ఓ విస్ఫొటనం! ఇక సకల చరాచర సృష్టి కచ్చితంగా దేవుడిచే ఆడబడుతున్న ఒక వింతనాటకం! ఔను, సాక్షాత్తూ సైన్సే ఇవాళ ఇలా ప్రభోధిస్తోంది! ఎవరో ఒక సూపర్ క్రియేటర్ లేనిదే ఇంతటి ప్రళయంలో ఈ అనంతకోటి బ్రహ్మాండరాశి మనుగడ సాగించడం అసాధ్యమని గ్రాండ్ డిజైన్ థియరీ సూత్రీకరిస్తోంది! కేవలం బిగ్ బ్యాంగ్ పేలుడు వల్లనే ఈ బ్రహ్మాండం జనిస్తే, దాని ఫలితం ఒక అణుబాంబు విధ్వసం సృష్టించే వినాశనంలా మాత్రమే ఉండేదని భౌతిక శాస్త్రజ్ఞుల ఉవాచ! కానీ, విశ్వం అలా లేదు! సకల జీవకోటి ఉద్భవించి, మనుగడ సాగించడానికి వీలైన పరిస్థితులను కలిగి ఉంది! విశ్వగమనాన్ని ఏదో ఒక శక్తి శాసించకుంటే ఇది సాధ్యం కాదని ఇవాళ్టి సైన్స్ ప్రవచిస్తోంది! ఈ కొత్త వాదనలకు మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్ పరిశీలనలు ఊతమిస్తున్నాయి! ఎవడో నడిపించేవాడు మాత్రం కచ్చితంగా ఒకడున్నాడు అనేదాకా ఇంచుమించు వచ్చాయి!

సైన్స్ కు బోధపడని బ్లాక్ మ్యాటర్ – బ్లాక్ ఎనర్జీల తత్వం!

విశ్వమూలాలుగా భావిస్తోన్న బ్లాక్ మ్యాటర్, బ్లాక్ ఎనర్జీల రహస్యాన్ని ఛేదించడానికి భౌతిక, ఖగోళ శాస్త్రజ్ఞులు అనేకరకాల ప్రయాస చేస్తున్నారు. ఈ రెండింటిలో ఒకటి గ్రావిటీని సృష్టిస్తూ బ్రహ్మాండాన్ని బంధించిపడుతుంటే, మరొకటి అందుకు విరుద్ధంగా పనిచేస్తూ విశ్వవ్యాప్తికి కారకమౌతోందని శాస్త్రీయంగా రూఢీ అయింది! విశ్వం మనుగడ, వినాశనం అనే కీలక అంశాలు ఈ శక్తులతోనే ముడిపడి ఉన్నాయని సైన్స్ తేల్చేసింది! ఐతే, వాటి గుట్టు మాత్రం ఇంకా వీడలేదు! ఆ తత్వం బోధపడితేకానీ సృష్టికారక మర్మం తెలియదు!

మల్టీ డైమెన్షన్స్, మెనీవల్డ్స్ అండ్ ప్యారలల్ యునివర్సెస్!

సమాంతర విశ్వాలు, అనేక ప్రపంచాల ఉనికిని కొట్టిపారేయలేమనే వాదనలు కూడా ఈమధ్య శాస్త్రీయంగా బలం పుంజుకుంటున్నాయి. మన ప్రతిరూపాలే ప్యారలల్ యూనివర్స్ ల్లో ఉన్నాయి. ఇహలోకంలో తీరని కోరికలు పరలోకంలో తీరుతాయి! ఇక్కడ మనం సాధించలేని ఆశయాలను, సమాంతర ప్రపంచాల్లో ఉన్న మనం సాధిస్తామని స్ట్రింగ్ థియరిస్టులు చెబుతున్నారు! ఇలా మానవ మేధస్సుకు అంతుచిక్కని అనేక రహస్యాలు ఇంకా ఈ అనంత బ్రహ్మాండంలో నిక్షిప్తమై ఉన్నాయని క్వాంటమ్ మెకానిక్స్ థియరీ అంటోంది! టైంతో కలిపి మనిషి అనుభవంలో ఉన్న 4 డైమెన్షన్లకతీతంగా మానవ ఊహకందని మరెన్నో డైమెన్షన్స్ ఈ సృష్టిలో ఉన్నాయనేది శాస్త్రీయ నిర్ధారణ దిశగా పరిశోధనలు జరుగుతున్న ఒక సూత్రీకరణ! వీటిలో ఏదో ఓ డైమెన్షన్లో దేవుడు అదే సూపర్ క్రియేటర్ ఉంటాడనీ, మానవులకు అతీతంగా అనేక శక్తులతో, అతడు మిగిలిన అన్ని డైమెన్షన్స్ కు యాక్సెస్ కలిగి ఉంటాడనేది మోడర్న్ సైన్స్ లో ఒక వెర్షన్! వివిధ రకాల కార్యకలాపాల్లో బిజీగా ఉంటూ నిరంతరంగా శ్రమిస్తూ నిరవధికంగా సాగే ఒక చీమలదండును మనిషి ఎలాగైతే చూడగలుగుతూ వాటి జీవనగమనాన్ని తన చర్యలతో ఎలాగైతే ప్రభావితం చెయ్యగలుగుతున్నాడో, అచ్చం అలాగే భగవంతుడు కూడా తన దివ్యశక్తులు, దూరదృష్టిల ఆధారంగా పాప పుణ్యాలను లెక్కిస్తూ మానవులను పాలిస్తుంటాడు!

భూమిని కాపాడుతున్న ఖగోళ సహజ రక్షణ కేంద్రాలు!

ఒకసారి ఆలోచించండి! రోడ్డుపై ఒక చిన్న గులకరాయి తడితేనే బైకులు జర్రున జారిపడిపోయి మనుషులు ప్రాణాలే కోల్పోయే నిర్దాక్షిణ్య ప్రపంచం ఇది! ఎగ్జాక్ట్ గా అలాంటి ఎక్స్ ట్రీమ్ యాక్సిడెంటల్ కండిషన్స్ తో విశ్వం కూడా మనుగడకోసం నిరంతరం యుద్ధం చేస్తోంది! విశ్వాంతరాళాల్లో అనేక భౌతిక ఆకృతులు, మరెన్నో ఖగోళ వస్తువులు, వింతలు, విపరిణామాలు! ఇక్కడ, ఏ ఒక్క చిన్న ఆస్టరాయిడ్ వచ్చి భూమికి తగిలినా సకల జీవకోటి వినాశనం తధ్యం! కానీ, అలా జరగడం లేదు! మనిషి రక్షణ కోసం ఏదో తెలియని ఒక అతీతశక్తి నిరంతరంగా పని చేస్తుందనేది కచ్చితంగా శాస్త్రబద్దం!

అంతరిక్షంలో వివిధ శకలాలను వలయాల్లో తన చుట్టూ తిప్పుకొంటున్న శనిగ్రహం కావచ్చు, ఇతర నక్షత్ర మండలాల నుంచి భూమి వైపు దూసుకువచ్చే ఆస్టరాయిడ్స్, ఇతర గ్రహశకలాలను నిలువరిస్తున్న గురుగ్రహం కావచ్చు, బాహ్య సౌరమండలంలో కొన్ని లక్షల కిలోమీటర్లు వ్యాపించి ఉన్న క్యూపర్ బెల్ట్ కావచ్చు ఇలా అనేక రకాల ఖగోళ సహజ రక్షణ కేంద్రాలు ఈ భూమ్మీద జీవకోటిని వెన్నంటి కాపాడుతున్నాయి! అవన్నీ అలా ఉన్నాయి కనకనే ఇవాళ మనం ఇలా ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం! వాటిలో ఏ చిన్న తేడా జరిగినా సర్వం నాశనం! సకలం భస్మమే! అందుకే మనం సహజసిద్ధం అనుకుంటున్నవన్నీ భగవత్ సృష్టిలో భాగమే! అఫ్ కోర్స్, కొన్ని వేలు, లక్షల ఏళ్లక్రితం భూగ్రహంపై అనేక ప్రకృతి వైపరీత్యాలు, ఉత్పాతాలు, విపత్తులు సంభవించి ఉండుగాక! ఏమో! అవన్నీ మానవసృష్టి జరగడానికి, తరవాతి కాలంలో మనిషి ప్రశాంతంగా జీవనం సాగించడానికి సృష్టికర్తచే రచింపబడిన పరిణామాలే అయుండవచ్చునేమో! అందుకే, దేవుడు ఎక్కడో ఓ చోట ఉండావచ్చునేమో!

సో, మై డియర్ నాస్తిక్స్ అండ్ జన అజ్ఞాన హేతువాదులారా! అరకొరగా, మిడిమిడి దశలో ఉన్న విజ్ఞానశాస్త్రం సంపూర్ణతను సాధించి ఈ బ్రహ్మాండ రహస్యాల నిగ్గు తేల్చేదాకా, ఐ సే షట్ యువర్ మౌత్ అండ్ ప్లీజ్ కీప్ క్వైట్.

From Face Book wall of
సూరజ్ వి. భరద్వాజ్