cropped cp.jpeg

Tadipatri: పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి

screenshot 2025 11 14 132738

తిరుమల: తిరుమలలో పరకామణికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి ఉన్నారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా అప్పట్లో రాజకీయ నాయకులు, తితిదే ఉన్నతాధికారులు పోలీసుల ఒత్తిడితో ఆ కేసును న్యాయస్థానంలో సతీశ్ కుమార్ రాజీ చేసుకున్నారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో.. కేసు రాజీ చేసుకున్న సతీశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *