Tributes: One of the First BJP MP Jangareddy died

మాజీ పార్లమెంట్ సభ్యులు జంగారెడ్డి మృతి పట్ల దత్తాత్రేయ సంతాపం

మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి గారి మృతి తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఉపాధ్యాయ స్థాయి నుండి శాసన సభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా జంగా రెడ్డి గారు ప్రజా జీవితంలో ఎదగడమే వారి కృషికి నిదర్శనమని, జాతీయ భావాలతో దేశ భక్తితో వారు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారని, వరంగల్ జిల్లాలో అనేక గ్రామాలకు కరెంటు (విద్యుత్తు)ను ఇప్పించారని, అందువల్ల వారిని కరెంటు జంగన్న అని పిలిచేవారని దత్తాత్రేయ గారు గుర్తుచేసుకున్నారు.

శాసన సభ లోను, పార్లమెంట్ లోను రైతు సమస్యలపై తన వాని వినిపించారని, వారు రైతు పక్షపాతి అని కొనియాడారు.

మాజీ ప్రధాన మంత్రి దివంగత అటల్ బిహారి వాజపేయి, ఎల్ కె అద్వానీ, నానాజీ దేశముఖ్ లాంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేశారని, ఆనాటినుండి వారు వేసిన పునాది నేడు వరంగల్ జిల్లాలో బిజెపి పెరిగి అనేక మంది నాయకుల ఎదుగుదలకు తోడ్పడిందని, జంగా రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కాంక్షించి అనేక సంవత్సరాలు పోరాటాలు చేశారని, విద్యా వ్యాప్తికై విద్యా సంస్థను స్థాపించారని, వారి మృతి జాతీయ భావాలున్న సంస్థలకు, రైతాంగానికి తీరని లోటు అని, రాజకీయ మైనా, ఇతర విషయాలైన తనతో లోతుగా చర్చించేవారని, వారి మృతి తో ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయానని, వారి మృతి జాతీయ భావాలున్న సంస్థలకు, రైతాంగానికి తీరని లోటు అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. .