తెలంగాణలో ఏపీకే ఫైల్ స్కామ్ కలకలం రేపుతోంది. ‘కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ అవుతుంది’ అంటూ టీం ఎస్బీఐ పేరుతో వందల వాట్సాప్ గ్రూపులకు నకిలీ సందేశాలు పంపించారు. లింక్‌ను నొక్కిన వెంటనే బాధితుల ఫోన్లు హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లి, అదే సందేశం ఆటోమేటిక్‌గా ఇతర గ్రూపులకు పంపబడుతోంది. ఆదివారం అధికారులు, మీడియా, విద్యార్థుల గ్రూపులు కూడా ప్రభావితమయ్యాయి. ఫోన్ల డేటా నేరగాళ్లకు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలువురు పోలీసులకు, 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు..

