వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: గచ్చిబౌలి ప్రాంతంలోని యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తూ, మియాపూర్ పరిధిలోని బీకే ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న అమలాపురం ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీష్ (31) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇటీవల సంక్రాంతి సెలవుల సందర్భంగా సతీష్ భార్య సొంతూరు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి తట్టుకోలేకనే సతీష్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
