మే డే సందేశం (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో మరియు తెలంగాణలోని సమస్త కార్మికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది. ప్రజా పాలనలో కార్మిక వర్గానికి అండగా నిలుస్తూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది. సంఘటిత, అసంఘటిత రంగాలలో ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి కార్మికుని సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటోంది.
అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికుల హక్కులను రక్షించేందుకు “తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికుల సంక్షేమ చట్టం – 2026”ను ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ఆమోదించింది. ఈ చట్టం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకుపైగా కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం ముందుండి పనిచేసి, వారి ప్రధాన డిమాండ్లలో ఎక్కువ భాగాన్ని నెరవేర్చింది. ఇటీవల ప్రకటించిన 11% వేతనవృద్ధి ద్వారా కార్మికుల పట్ల తన నిబద్ధతను మరోసారి చాటింది.
తెలంగాణలోని ప్రతి కార్మికుడు గౌరవప్రదమైన జీవితం గడపాలని, సురక్షితమైన పనివాతావరణంలో పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధికి కార్మికులే మూలస్తంభం అనే విషయాన్ని ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
కార్మిక హక్కుల సాధనకు మార్గదర్శకుడైన Dr. B. R. Ambedkar ఆశయాలను, అలాగే కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కాకా వెంకటస్వామి గారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
డా. జీ. వివేక్ వెంకటస్వామి
కార్మిక మరియు గనుల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రం.
