హిట్-అండ్-రన్ హర్రర్: కారు బోనెట్‌పై వ్యక్తిని 2 కి.మీ. ఈడ్చిన డ్రైవర్
హైదరాబాద్, మే 3: నగరంలో మరోసారి షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్-అండ్-రన్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది.
రంగారెడ్డి జిల్లా గాయత్రీ నగర్ నుంచి ఎల్.బి. నగర్ వైపు బైక్‌పై వెళ్తున్న ఎస్.కె. జిలానీ, అతని కుమారుడు ఫైసల్‌ను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో కారు డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించాడు. వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన జిలానీని పట్టించుకోకుండా, అతను కారు బోనెట్‌పై వేలాడుతుండగానే దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. బాధితుడు నొప్పితో విలవిలలాడుతున్నా డ్రైవర్ కృరంగా వ్యవహరించడం ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
ఈ ఘటనను అక్కడి వాహనదారులు వీడియోగా చిత్రీకరించడంతో విషయం బయటపడింది. కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వెళ్లి, తిరిగి మండమల్లమ్మ జంక్షన్ వద్ద స్థానికులు అడ్డుకోవడంతో డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారైనట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ఫైసల్‌కు రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
