అంగట్లో బోగస్ విద్యా సర్టిఫికెట్లు..

whatsapp image 2025 11 24 at 1.14.29 pm

టెన్త్ 50 వేలు, ఇంటర్ 75 వేలు, డిగ్రీ 1.20 వేలు.. బిటేక్ ఫేక్ సర్టిఫికెట్స్..

అప్రమత్తంగా ఉండాలని సూచన!

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో…

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అవసరం ఉన్నవారికి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
కేసు వివరాలను ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిమితిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్‌ అటకట్టించేందుకు శనివారం విశ్వసనీయ సమాచారంతో నార్సింగి పోలీసులు స్థానిక నార్సింగి చింత చెట్టు ప్రాంతంలో పహారా ఏర్పాటు చేశారు.
నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇవ్వడానికి వచ్చిన ఐదుగురు వ్యక్తుల ముఠా ను అరెస్టు చేశారు. పట్టుకున్నారు. ఆ సమయంలో వారి వద్ద నుంచి ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, ముద్రణ, విక్రయం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు నిందితుల విచారణలో అంగీకరించారు.

అరెస్టైన నిందితులు..

ప్రధాన తయారీదారుడు మీర్జా అక్తర్ అలీ బైగ్ అలియాస్ అస్లాం, సర్టిఫికెట్ల కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మహ్మద్ అజాజ్ అహ్మద్తో పాటు మూడో నిందితుడు వడ్డేపల్లి వెంకట్ సాయిని పట్టుకున్నారు. అతడు నకిలీ డిగ్రీ పట్టా కొనుగోలుదారుడు. నకిలీ సర్టిఫికెట్ల కొనుగోలుదారుడైన విస్టాలా రోహిత్ కుమార్, నకిలీ సర్టిఫికెట్ల కొనుగోలుదారు బీటెక్ సర్టిఫికెట్ కొనుగోలుదారుడైన సత్తూరి ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుండి నకిలీ సర్టిఫికెట్లతో పాటు మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ డబ్బు కోసం నకిలీ, మోసపూరిత విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నట్లు స్పష్టమైంది. అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారిని రిమాండ్‌ విధించింది. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన, తయారు చేయడంలో ప్రోత్సహించిన, వాటిని కొనుగోలు చేసిన, విక్రయించిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *