మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ
TG: మావోయిస్టుల ఎన్కౌంటర్తో అలజడి రేగుతున్న వేళ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ ఎదుట 37 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు అజాద్, అప్పాసి నారయణ, ఎర్రాలు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ ప్రెస్మెట్ నిర్వహించి పలు విషయాలు వెల్లడించనున్నారు. కాగా ఆపరేషన్ కగార్తో పలు మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు.

