కాలేశ్వరంలో సీఎంతో భక్తి వేడుకలు – ఆలయ పునరుద్ధరణకు భూమిపూజ
కాలేశ్వరం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా | తేదీ: 20-04-2026
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునరుద్ధరణ పనులకు శాస్త్రోక్తంగా భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కూడా హాజరయ్యారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రజల సుఖశాంతి, సుభిక్షం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
తరువాత ఆలయ పునరుద్ధరణ పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.
