అంబర్పేటలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
అంబర్పేట నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.
