నేటికీ తిరుమల ఉచిత అన్నదాన సత్రానికి 40 ఏళ్లు…
తిరుమల లో నాడు ఎన్టీఆర్ హయాంలో అన్నదానం సత్రం ప్రారంభం…
87 ఏళ్ల వయస్సులో 1881లో తుదిశ్వాస విడిచిన తరిగొండ వెంగమాంబ భక్త కవయిత్రి.తిరుపతి శ్రీవేంకటేశ్వరుని భక్తురాలు.స్వామి ఏకాంతసేవలో పాల్గొనడానికి,రాత్రి చివరి హారతి ఇవ్వడానికి ఆమెకు ప్రత్యేక అనుమతి ఉండేది. తిరుపతికి వచ్చిన భక్తులకోసం ఆమె అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు
ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించి,తిరుమలలో భక్తులకు ఉచిత అన్నదాన పథకం ప్రారంభించారు రామారావు గారు. పథకానికి విరాళాలు ఇవ్వమని ఆయన కోరినప్పుడు మద్రాసుకు చెందిన ఎల్.వి.రామయ్య ముందుగా స్పందించి 10 లక్షల రూపాయలు ఇచ్చారు.మాన్ సిం గ్ చారిటీస్ వారు 20 లక్షలు విరాళంగా ఇచ్చారు
ఆ విధంగా 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన నిత్య అన్నదాన పథకం మూల నిధి ప్రస్తుతం రూ 2,200 కోట్లు దాటింది.నాడు 2 వేల మందితో ప్రారంభమై నేడు రోజుకు లక్ష మంది భక్తులకు అన్నవితరణ చేసే స్థాయికి అభివృద్ధి చెందింది ట్రస్ట్,ఈ పథకాని 2014 లో శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ గా పేరు మార్చిన టీటీడీ
అత్యధికంగా 9.7 లక్షల మంది దాతలు కలిగివున్న ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్,ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ 44 లక్షలు రూపాయలు అవుతుంది.
