యువత చిన్న సమస్యలు, గొడవలకే విడాకులు తీసుకుంటోంది. ఈ కల్చర్ హైదరాబాద్లో పెరుగుతోంది. ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతినెలా సుమారు 250 విడాకుల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 25 – 35 ఏళ్ల మధ్య ఉన్న జంటలు చిన్న కారణాలకే డివోర్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. యువ జంటలు సహనం, సర్దుబాటు, కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇచ్చి చిన్న సమస్యలకే కోర్టు మెట్లెక్కకుండా వివాహ బంధాన్ని కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

