బస్సు ఎక్కలేక పోతున్న 800 ఏళ్ల చరిత్ర కల్గిన రాయదండి గ్రామం
రామగుండం పట్టణానికి కూతవేటు దూరం లో ఉన్న రాయదండి గ్రామానికి 800 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉంది, కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు కనీస బస్సు సౌకర్యం కూడ లేకపోవడం శోచనీయం, రాయదండి గ్రామం, పరిసర గ్రామాల నుండి ప్రతీ నిత్యం విద్యార్థులు, కార్మికులు, రైతులు వందల సంఖ్యలో ప్రజలు గోదావరిఖని, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు, అలాంటిది ఇప్పటి వరకు ఆటోలు మరియు వివిధ ప్రైవేటు రవాణా వ్యవస్థ ల పైన ఆధార పడుతూ చాలా మంది ప్రమాదాలకు గురి అవుతున్నారు,
కొద్ది రోజుల క్రితం నుండి లిగాపురం వరకు వచ్చే బస్సులు కూడా ఆర్ టీ సి వారు నిలిపోయేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజు గోదావఖని నుండి పొట్యాల, మొరుమురు, కుక్కల గూడూరు తదితర ప్రాంతాలకు పెద్దంపేట గ్రామం మీదుగా గోదావరిఖని బస్టాండు నుండి అనేక బస్సులు నడిపిస్తున్నాయి అందులో కొన్ని బస్సులను పెద్దంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం దారి మీదుగా 1.3 కిలో మీటర్ల దూరం లో ఉన్న రాయదండి బోర్డు వరకు బస్సులను నడిపిస్తే రాయదండి తో పాటు పాములపేట, విలేజీ రామగుండం తదితర గ్రామాలకు చెందిన వందల మంది ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉంటుంది. దీని పైన స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు దృష్టి పెట్టి రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్న రాయదండి గ్రామానికి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
కునారపు రమేష్ (KR)
రాయదండి గ్రామ నివాసి