హార్ముజ్ దాటిన LPG నౌక.. భారత్‌కు ఊరట!
యుద్ధ ఉద్రిక్తతలు, భద్రతా ఆందోళనల మధ్య భారత్‌కు భారీ ఊరటనిచ్చే పరిణామం సంభవించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్‌కు బయల్దేరిన LPG ట్యాంకర్ ‘MV సన్‌షైన్’ సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటింది.
ఇరాన్ రేవుల దిగ్బంధం, హార్ముజ్ జలసంధి మూసివేత భయాల నడుమ కూడా ఈ నౌక ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయల మధ్య భారత్‌కు చేరుతున్న 15వ LPG నౌకగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియన్ నేవీతో పాటు ఇతర సముద్ర భద్రతా సంస్థల సమన్వయంతో నౌకకు భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ వాణిజ్య రవాణాపై తీవ్ర ప్రభావం ఉన్నప్పటికీ, కీలక ఇంధన సరఫరాలను కొనసాగించేందుకు భారత్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ‘MV Sunshine’ సురక్షిత ప్రయాణ గ్యాస్ సరఫరా పునరుద్ధరణలో కీలక మైలురాయిగా మారనుంది. దేశీయ LPG నిల్వల స్థిరీకరణకు కూడా ఇది సహాయపడే అవకాశం ఉందని చెప్పారు.
