యువ నాటకోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 6:తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా నిర్వహిస్తున్న మూడు రోజుల యువ నాటకోత్సవాన్ని రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి డా.
గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ నాటకోత్సవం మే 6, 7, 8 తేదీలలో కొనసాగుతుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అనేక సంవత్సరాలుగా కళాకారులకు వేదికగా నిలుస్తూ, సాంస్కృతిక రంగానికి విశేష సేవలు అందిస్తోందన్నారు. రాష్ట్రంలో యువ కళాకారుల ప్రతిభను వెలికితీయడంలో ఈ అకాడమీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధి, సంప్రదాయ పరిరక్షణలో సంగీతం, నాటకం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కళల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, యువతకు అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు.
సమాజంలో నటనకు ఉన్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, కళాకారులు తమ ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మంత్రి సూచించారు. యువ నాటకోత్సవం ద్వారా కొత్త కళాకారులు వెలుగులోకి వస్తారని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి కొత్త ప్రతిభను పరిచయం చేయడంలో ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.
