వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్..!
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి- 563 విస్తరణ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది…! భారత్మాల ప్రాజెక్టులో భాగంగా రహదారిని నాలుగు లైన్లుగా మార్చేందుకు రూ.2,484 కోట్లు కేటాయించారు..!జగిత్యాల-కరీంనగర్-వరంగల్ సెక్షన్లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు జంక్షన్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు చేపడుతున్నారు..! పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశముండగా, పూర్తి అయితే వరంగల్-ఖమ్మం ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది..!!

