cropped cp.jpeg
Latest

గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు

whatsapp image 2025 12 02 at 11.43.36 am

ఇంటింటికి 5 లక్షల బీమా, పెళ్లికి పుస్తె మెట్టెలు, ఉచిత అంబులెన్స్ లాంటి అనేక హామీలు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థులు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో, గ్రామ ప్రజలకు పోటాపోటీగా హామీలు ఇస్తున్న అభ్యర్థులు

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చిన పనుల వనమ్మ నరసింహ యాదవ్ అనే అభ్యర్థి

అయితే ఆ గ్రామంలో 700 ఇండ్లు ఉండగా, ప్రతీ ఇంటికి ఏడాదికి రూ.1200 ప్రీమియం కడితే, ఏడాదికి రూ.8.40 లక్షలు, ఐదేళ్లకు రూ.42.5 లక్షలు అవుతుందని తెలిపిన గ్రామస్తులు

ఈ హామీతో పాటు తన మ్యానిఫెస్టోలో మొత్తం 15 హామీలు ప్రకటించిన సదరు అభ్యర్థి

ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహనికి రూ.5,116 ఇస్తానని, ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంపు నిర్వహణ, శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి రూ.15వేల ఆర్థికసాయం, ఇల్లు కట్టుకునేవారికి స్లాబ్ వేసుకునే సమయంలో రూ.21వేలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్ల పంపిణీ, ఉన్నత చదువులకు ఆర్ధిక సాయం, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు, శివరాత్రి, శ్రీరామ నవమి, మొహరం సందర్భంగా ఊర్లో అన్నదానం, రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు, గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, దహన సంస్కారాలకు రూ.10వేలు, అంత్యక్రియల కోసం వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానని తన మ్యానిఫెస్టో ద్వారా ప్రకటించిన సదరు అభ్యర్థి

గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపరం గ్రామంలో తనను గెలిపిస్తే తాను అమలు చేసే 22 హామీలతో మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చి, ఈ హామీలను అమలు చేయకపోతే పదవి నుండి తప్పుకుంటానని బాండ్ పేపర్లో పేర్కొన్న ఆంజనేయులు అనే సర్పంచ్ అభ్యర్థి

అభ్యర్థులు కురిపిస్తున్న వరాల జల్లు కారణంగా, ఇచ్చే హామీల కారణంగా, వేలం పాట ద్వారా అనేక గ్రామాల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న గ్రామస్తులు

ఆదిలాబాద్ జిల్లాలో 22 మంది, నిజామాబాద్ జిల్లాలో 10 మంది, కామారెడ్డిలో 5 మంది, నిర్మల్ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో 6 మంది, జనగామ జిల్లాలో 6, వరంగల్ జిల్లాలో 5 మంది, మహబూబాబాద్ జిల్లాలో 3 మంది, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2 మంది, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చిన్న ఆడిశర్లపల్లి గ్రామంలో, గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామంలో దేవాలయం నిర్మిస్తామని చెప్పిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link