ఐ బొమ్మ కేసులో సంచలన విషయాలు.. రంగంలోకి ఈడీ

e8d3a9fc 48a3 4a72 a802 0817617ffd49

హైదరాబాద్, నవంబర్ 18: ‘ఐ బొమ్మ’ కేసులోకి ఈడీ ఎంటర్ అవుతోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ సీపీకి ఈడీ లేఖ రాసింది. ఐ బొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కేసుకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పటికే IBOMMA యజమాని ఇమ్మడి రవి, అలియాస్ ఐబొమ్మ ర‌వి బ్యాంక్ ఖాతా నుంచి రూ.3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్దమొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయినట్టు భావిస్తున్నారు. నెలకు రూ.15లక్షలు క్రిప్టో వాలెట్ నుంచి రవి NRE ఖాతాకు బదిలీ అయినట్టు తెలుస్తోంది. వీటిపై ఈడీ దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఈ కేసుకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు :-

ఐ బొమ్మ రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు

ఐ బొమ్మ, బప్పం టీవీ పేరు మీద 17 వెబ్సైట్లు నిర్వహించిన ఐబొమ్మ రవి

క్రిప్టో కరెన్సీ వాలెట్ నుంచి రవి ఎన్నారై ఖాతాలకు నగదు బదిలీ

ఐబొమ్మ రవిని పట్టించిన రెండు డొమైన్లు

ఒక డొమైన్ అమెరికాలో.. మరొక డొమైన్ అమీర్పేట్‌లో రిజిస్టర్ చేసిన రవి

విదేశీ పౌరసత్వం తీసుకున్న ఐ బొమ్మ రవి

దేశ డిజిటల్ భద్రతకు రవి ప్రమాదకరం

ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి

పైరసీ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడంటూ పేర్కొన్న పోలీసులు

17 వెబ్సైట్లు నిర్వహించిన ఐ బొమ్మ రవి

క్రిప్టో కరెన్సీ వాలెట్ నుంచి రవి ఎన్నారై ఖాతాకు నిధులు బదిలీ

ఐ బొమ్మకు, బెట్టింగ్ సైట్లకు మధ్య ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేసినట్లు గుర్తింపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *