Serial actress Tunisha committed suicide





సీరియల్ నటి తునీష ఆత్మహత్య!

హిందీ సీరియల్ నటి తునిషా శర్మ ముంబై లో సెట్ లోనే మేకప్ గది లో ఉరి వేసుకుని చనిపోయింది! తోటి నటులు, సిబ్బంది ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది! ఆమె వయసు 20. సరిగ్గా చనిపోవడానికి మూడు గంటల ముందే హుషారుగా తనకు మేకప్ చేస్తూ హెయిర్ స్టైల్ చేస్తున్న ఫోటో ఇష్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది! ఆమె చివరి పోస్ట్… ప్యాషన్ వున్న వారు ఎవరూ ఆగరు, ఎవ్వరు ఆపలేరు… ఆకాశమే హద్దు అని పోస్ట్ చేసింది… కానీ, తునీష మాత్రం నేరుగా దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది! ఆత్మహత్య కు కారణం ఏమిటో ఇంకా తెలియలేదు! పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు! ప్రేమలో ఉందని ఒక టాక్! సెట్ లో ఎవరో వేధిస్తున్నారనేది మరో టాక్! అసలు విషయం ఏమిటో పోలీసులు తేల్చాలి!

చండిగఢ కు చెందిన తునిష బాల నటి గా బాలీవుడ్ లోకి ప్రవేశించింది… ఫితూర్ సినిమాతో! బార్ బార్ దేఖో లో జూనియర్ కత్రినా పాత్రను పోషించింది! కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మహావీర రాణా ప్రతాప్ సీరియల్ తో టీవీ రంగం లోకి ప్రవేశించింది! ఆ సీరియల్ సోనీ లో ప్రసారమయ్యింది! ఆ తరువాత మరో సంచలన సీరియల్ సామ్రాట్ అశోక! అది కలర్స్ లో ప్రసారం అయ్యింది! కొన్ని ఫ్యాషన్ షోల లోనూ మెరిసింది! మరో రెండు సీరియల్స్ తో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది! ఇంత అందమైన జీవితాన్ని ఎందుకు ముగించిందో ఏమో!