Students are the real heroes in the world: Kailasatyarthi

ప్రపంచంలో నిజమైన హీరోలు విద్యార్థులే: కైలాసత్యర్థి

విద్యార్థులు చిన్నప్పటినుండే మానవ విలువలను పెంపొందించే దిశగా ఆలోచనలు చేయాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. సోమవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దాదాపు యాభై వేల మంది విద్యార్థులచే నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కైలాసత్యర్థి బాలల విద్య పై ప్రసంగించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… ఈ ప్రపంచంలో నిజమైన హీరోలు విద్యార్థులే.. ,చిన్నారులే.. అని అన్నారు.సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా మానవ విలువలను పెంపొందించే దిశగా ఆలోచనలు చేయాలని ఆయన అన్నారు. హిందూ ,ముస్లిం, క్రిస్టియన్, భేద భావం లేకుండా అందరూ కలిసికట్టుగా చదువుకోవడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. సమాజంలో ప్రతి విద్యార్థి ఆడ,మగ తేడా లేకుండా చదువుకోవడానికి హక్కు ఉందని కాబట్టి ఎక్కువ కులం తక్కువ కులం మతం అనే భేదం లేకుండా అందరూ సమానంగా విద్యను అభ్యసించాలని ఆయన అన్నారు. అయితే కొందరు తమ అభిరుచులను బట్టి తమ యొక్క కలలకు సహకారం చేసుకోవడానికి డాక్టర్లు,ఇంజనీర్లు, రాజకీయ నాయకులు కావడానికి ఆలోచనలు చేయాలని ఆయన అన్నారు. సమాజంలో ముందుగా తల్లిదండ్రులను గౌరవించాలని అదేవిధంగా పాఠశాలల్లో ఒకరినొకరు కలుగల్పుగా ఉండే విధంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. సినిమాలు చూస్తున్నప్పుడు విద్యార్థులు చాలా విషయాలను గమనిస్తారు అని..అయితే సినిమాలో డైరెక్టర్ చెప్పినట్లుగా హీరో, హీరోయిన్ నటిస్తారని కానీ నిజజీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలను అధికమించుటకు చిన్నప్పటినుండే ఆలోచనలు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసిన బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ముఖ్యంగా భారతదేశంలో బాలల హక్కుల కోసం నేను ఆలోచనలు చేశానని అన్నారు.నేను పాఠశాల లో చదువుకుంటున్న సమయంలో ఒక పిల్లవాడు నన్ను ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.. నేను పని చేస్తున్నాను, నీవు చదువుకుంటున్నావు అని ఆ పిల్లవాడు నాతో చెప్పాడని అన్నారు. మా ఇద్దరి మధ్యలో ఈ వ్యత్యాసం ఎందుకు..? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే..నాకు దుఃఖం ఆగలేదు అని అన్నారు.ముఖ్యంగా బాలలు తమ హక్కులను కోల్పోకుండా చూడాలనే ఉద్దేశంతో నిరంతరం బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా చిన్నారులు అందరూ ఆడ మగ అనే తేడా లేకుండా, కులం మతం భేదం లేకుండా ఉండాలని అన్నారు.ఎవరి వొంట్లో అయిన ఎర్రటి రక్తమే ఉంటుంది.. ఆ రక్తము కులానికొక రంగు ఉండదని స్పష్టం చేసారు.విద్యార్థులందరూ కలిసిమెలిసి ఉండే విధంగా మానవ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఎదగాలని అన్నారు. దేశం లో వనరుల కొరత లేదని, అన్నారు. నీరు, ఆహారం ఏ ఒక్కరూ వృధా చేయరాదని అన్నారు. పేద పిల్లలు ఇంకా కలుషిత నీరే తాగుతున్నరని ఆవేదన వ్యక్తం చేసారు.తను జర్మనీ లో ఒక నోబెల్ ప్రైజ్ విజేత ను కలిసి షేక్ హ్యాండ్ తీసుకోవడం జరిగింది అని… ఆ స్ఫూర్తి తో తను సామాజిక సమస్యల పై పోరాటం ప్రారంభించినట్లు తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి నిర్భంద విద్య ఉండాలని ఈ దిశగా ప్రభుత్వాలు ప్రత్యేక ద్రుష్టి సారించాలని కోరారు. విద్యార్థులు కలలు కంటే సరిపోదని .. ఆ కలలు సాకారం ఐయ్యేందుకు తగిన కృషి చేయాలి అని అన్నారు.ఆడపిల్లలు ఎక్కువ ఉన్న కుటుంబం లో బాల్య వివాహాలు ఇప్పటికి జరుగుతున్నాయి అని.. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ గా ఉంది అని అన్నారు.బాలల హక్కులపై చట్టాలను మరింత కఠినం చేయాలి అని అన్నారు. చిన్నారులు సాధారణంగా ప్రశ్నించే తత్త్వం అలవడుతుంది.. ప్రశ్నించే తత్త్వం ను తల్లి దండ్రులు, గురువులు ప్రోత్సాహించాలని అన్నారు.విద్యార్థులు సమాజం కోసం ఆలోచించాలి అని అన్నారు.దేశం ఒక్కటే ప్రజలంతా ఒక్కటే అని అన్నారు. కుల, మతాల, ధనిక పేదలకు అతీతంగా అందరూ పాఠశాలకు వెళ్ళా లి, చదువుకోవాలి అని అన్నారు.విద్యార్థులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు అని తెలిపారు.బాల కార్మిక వ్యవస్థ ను అందరం కలిసి నిర్మూలిద్దాం అని కోరారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి వ్యక్తి చదువుకునే హక్కు ఉందని దీనిని తెలంగాణ రాష్ట్రంలో తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు విద్యార్థుల చదువు కోసం వెయ్యి పాఠశాలలను ప్రారంభించారని ఇందులో కులం మతం భేదం లేకుండా అన్ని కులాల వర్గాల వారు చదువుకునే విధంగా పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు వరంగల్ జిల్లాకు ఇద్దరు నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చారని ఇందులో కాకతీయ విశ్వవిద్యాలయంలో గౌరవ డాక్టరేట్ కోసం మదర్ తెరిసా రాగ ప్రస్తుతం కైలాస్ సత్యార్థి ఈ గడ్డపై అడుగు పెట్టడం మన అందరికీ గర్వకారణం అని ఆయన అన్నారు.చిన్నారుల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి కైలాష్ సత్యార్థిఅని అన్నారు.తెలంగాణలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది అని తెలిపారు.పిల్లల హక్కులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశం బాగుచేయటం కోసం ఒక మంచి నాయకుడు అవసరం అని ఆ నాయకుడు మీలో ఒకొక్కరు ముందుకు రావాలి అని అన్నారు.

పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన వరంగల్ నగరానికి బాలల హక్కుల కోసం నిరంతరం పాటుపడి నోబెల్ శాంతి బహుమతి పొందిన కైలాస సత్యార్థి ఇక్కడికి రావడం మన అదృష్టమని ఆయన అన్నారు. సత్యార్థి ఫౌండేషన్ 86వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, 80వేల మందికి విముక్తి కల్పించారు అని అన్నారు. తెలంగాణ రాష్టం లో బాలల పరిరక్షణ జరుగుతుంది అని వివరించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ వరంగల్ , జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డాక్టర్ గోపి ,సీపీ రంగనాధ్,మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, dro వాసు చంద్ర, pd drda శ్రీనివాస్ కుమార్, DEO లు అహ్మద్ హై, వాసంతి,dr. సుధాకర్, prof రవీందర్, dr రాజేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.