కాజీపేట: రైలులో 20 తులాల బంగారం చోరీ
కాజీపేట: రైలులో 20 తులాల బంగారం చోరీవిశాఖపట్టణం-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఏ-2 కోచ్ 20 తులాల బంగారం చోరీకి గురైనట్టు బాధితులు జీఆర్పీకి ఫిర్యాదు చేశారు. విశాఖకు చెందిన శారదాంబ, చిన్నమ్నాయుడు దంపతులు రాత్రి నిద్రలో ఉండగా బ్యాగులోని బంగారం మాయమైంది. కాజీపేటకు రాగానే చోరీ విషయం గుర్తించారు. కాచిగూడలో చేసిన ఫిర్యాదు కాజీపేట జీఆర్పీకి బదిలీ అయిందని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు.

