తెలంగాణ అమ్మాయి పసిడి పంచ్👊
హైదరాబాద్:నవంబర్ 21ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది. మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్ గెలిచిన తీరు చూసిన అభిమానులు గర్వంగా ఉప్పొంగిపోయారు. ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్పై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి రౌండ్ నుంచి నిఖత్ దూకుడే కనిపించింది. ప్రత్యర్థి ప్రయత్నాలను ఒక్కోసారి…

