Tadipatri: పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి
తిరుమల: తిరుమలలో పరకామణికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి ఉన్నారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా అప్పట్లో రాజకీయ నాయకులు, తితిదే ఉన్నతాధికారులు పోలీసుల ఒత్తిడితో ఆ…


