HyderabadLatestTelangana

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

కార్మిక సంక్షేమంలో తెలంగాణకు జాతీయ స్థాయిలో ప్రశంసలు – గిగ్ వర్కర్స్ చట్టం, కనీస వేతనాల సవరణతో కార్మికులకు మేలు

హైదరాబాద్, నవంబర్ 26: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల సదస్సులో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న విధానాలను వివరించామని తెలిపారు. కనీస వేతనాల అమలు, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయని చెప్పారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందన్నారు. అనంతరం ఢిల్లీలో జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమైనట్లు వెల్లడించారు.

దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకొచ్చామని, గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సమస్యకు పరిష్కారం చూపుతూ కార్మికులకు న్యాయం చేస్తున్నామని వివరించారు. నిరుద్యోగ యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏటీసీల నెట్‌వర్క్‌ను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను మంత్రి తీవ్రంగా ఖండించారు. సిద్ధిపేటలో పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావడంలో తాను కీలకంగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. గిగ్ వర్కర్స్ చట్టం, కనీస వేతనాల సవరణ, ఏటీసీల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తున్నానన్నారు. కొందరు అసూయ, ఈర్ష్యతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వార్తలు రాసేవారు వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.

పార్టీలో తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. అంతర్గత అంశాలను మీడియా ముందు చర్చించడం తనకు ఇష్టం లేదన్నారు. ఎవరికైనా సమస్యలు, అభిప్రాయ భేదాలు ఉంటే పార్టీ వేదికపైనే చర్చించుకోవాలని సూచించారు. తాను ఎవరిపైనా ఫిర్యాదులు చేయడం లేదని, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని తెలిపారు. తన బలం తనకు తెలుసని, దానిని మరింత పెంచుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు మధ్య నెలకొన్న అంశంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. వంశీకృష్ణ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు. ఢిల్లీలో ప్రజా సమస్యలు, వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలనేది ఆయనే నిర్ణయించుకుంటారని, ఈ వ్యవహారంలో తాను ఎక్కడా జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఈలోగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. పార్టీ నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి మంచి గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తానని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

Cyber Post

About Cyber Post Cyber Post is a leading online news portal based in Hyderabad, dedicated to delivering accurate, timely, and trustworthy news to readers across India and beyond. Guided by our tagline — “News You Can Trust” — we are committed to upholding the highest standards of journalism in an era of rapid digital transformation and information overload. At Cyber Post, our mission is simple yet powerful: to inform, inspire, and empower our audience with credible reporting, insightful analysis, and unbiased coverage. Our team of experienced journalists and digital media professionals work around the clock to bring you the latest updates from politics, business, technology, entertainment, sports, and current affairs — all presented with integrity and clarity. Founded in Hyderabad, the city’s dynamic spirit of innovation and diversity inspires our approach to journalism. Whether it’s breaking news, investigative reports, or community stories, Cyber Post stands as a trusted source for truth in the digital age. With a growing readership and a reputation for credibility, Cyber Post continues to redefine digital news by blending traditional journalistic values with modern storytelling and technology. Cyber Post – News You Can Trust.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *