Hyderabad: టాప్ మావోయిస్ట్ నాయకులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ తెలంగాణలో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితో పాటు సుమారు 20 మంది క్యాడర్ కూడా లొంగిపోయే అవకాశం ఉందని, ఇది ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అతిపెద్ద వ్యవస్థీకృత లొంగుబాట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, విలేజీ రామగుండానికి చెందిన అప్పాసి నారాయణ 40 సంవత్సరాల క్రితం అడవి బాట పట్టారు, అప్పటి నుండి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక పదవైన కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్.. ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చడం కారణంగా అనేక మంది మావోయిస్టు ముఖ్య నాయకులు లొంగిపోవడం లేదా పోలీసుల చేతిలో చనిపోవడం జరుగుతున్న విషయం తెలిసిందే…. ఇదే క్రమంలో కేంద్ర కమిటీలో కీలక సభ్యుడు అప్పాసి నారాయణ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీరని లోటుగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

