కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
కార్మికుల హక్కుల కోసం పార్లమెంట్‌లో పోరాడుతా: గడ్డం వంశీ కృష్ణ
హైదరాబాద్, మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేశారు.
గతంలో కార్మికులకు తగిన హక్కులు లేకుండా అధిక గంటలు పనిచేస్తున్నారని, కనీస వేతనాలు కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి గుర్తుచేశారు. అణిచివేతకు గురైన కార్మికుల కోసం పూర్వ నాయకులు పోరాడి హక్కులను సాధించారని పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట్ స్వామి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ప్రస్తుతం యాజమాన్యాలు–కార్మికులు కలిసి ముందుకు సాగే మార్పులు వచ్చాయని చెప్పారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించాలంటే సమిష్టి కృషి అవసరమని, ముఖ్యంగా కార్మికులకు నైపుణ్య శిక్షణ కీలకమని మంత్రి వివరించారు. రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) ద్వారా సుమారు 20,000 మంది యువతకు శిక్షణ ఇస్తున్నామని, పిల్లలకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టి ఉత్పాదకత పెంపుపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్‌లో కార్మిక శాఖకు రూ.90 కోట్లు కేటాయించినట్లు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్‌ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. హమాలీల సంక్షేమానికి కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. కార్మికులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించామని, వాటిని మరింత విస్తరించేందుకు కృషి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు గౌరవం అందించారు. ఏ పనినైనా తక్కువ చేసి చూడకూడదని, కార్మికులను కుటుంబ సభ్యులు భావించి అండగా నిలవాలని సూచించారు. కేవలం చట్టాలు చేయడం సరిపోదని, ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థలో మానవీయ దృక్పథం పెరగాలని ఆకాంక్షించారు.
కార్మిక శాఖకు కేటాయించిన నిధుల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అర్హులైన ప్రతి కార్మికుడిని చూడాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆయన సూచించారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రాముఖ్యత ఇచ్చారని గుర్తుచేశారు. 8 గంటల పని ఆలోచన ప్రోత్సహించిన అంబేద్కర్లు ఇప్పటికీ మార్గదర్శకమని అన్నారు. కాకా వెంకటస్వామి సింగరేణి కార్మికుల కోసం చేసిన సేవలను స్మరించారు.
ప్రస్తుత ఉద్యోగ అవకాశాలు సవాలుగా మారుతున్న నేపథ్యంలో, ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ATCల ద్వారా శిక్షణ అందించి ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 120 ATCల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలుస్తోంది. కార్మికుల సమస్యలపై పార్లమెంట్‌లో తన స్వరం వినిపిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, లేబర్ కమిషనర్ పమేల సత్పతి, కార్మిక నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
