హైదరాబాద్‌లో హైఅలర్ట్.
అన్ని ప్రాంతాల్లో తనిఖీలు.
ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవక ముందే దేశంలో ఐదు ఎయిర్ పోర్ట్‌లను పేల్చేస్తామని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్ పోర్ట్‌లను పేల్చేస్తామని ఇండిగో కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో అన్ని ఎయిర్ పోర్టుల్లో బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవక ముందే దేశంలో ఐదు ఎయిర్ పోర్ట్‌లను పేల్చేస్తామని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని ఇండిగో కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో అన్ని ఎయిర్ పోర్టుల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం, హైదరాబాద్.. ఐదు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలకు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈమెయిల్ అందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నగరాల్లో బాంబు బెదిరింపులు సంభవించే అవకాశం ఉందని ఈమెయిల్‌లో పేర్కొన్నారని.. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ విమానాశ్రయాలలో అవసరమైన భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.


