Mens Day 2025 Special : .. .. .. నాన్నగా.. జీవితమంతా తన వాళ్ల కోసమే బతికే మగ మహానుభావులు..!

screenshot 2025 11 19 115146

ఒక తల్లికి కొడుకుగా.. భార్యకు భర్తగా. చెల్లికి అన్నగా.. బిడ్డకు నాన్నగా.. చెలిమికి తోడుగా.. ఎందరికో అయినవాడిగా.. జీవితమంతా తన కంటే తన అనుకునే వారి కోసమే బ్రతికే మగ మహానుభావులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.

ప్రపంచం జనాభాలో అత్యధికంగా పిల్లలు, యువకులు, మధ్యవయస్కులు ఉన్నారు. వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే తప్పేంటన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ మెన్స్ డే. కుటుంబం, సమాజం కోసం వాళ్లు చేస్తున్న త్యాగాలు, విజయాల్ని గుర్తు చేసుకోవడమే ఈ రోజు ఉద్దేశం. నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి.. ప్రత్యేకించి మగవాళ్లకు సెలవంటూ ఏమీ ఉండదు. కానీ.. ఈ రోజు వెనుక కొన్ని లక్ష్యాలు, ఆశయ సాధనల్ని నిర్దేశిస్తారు. మగవాళ్లు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, ఇతరత్రా సమస్యలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. లింగ సమానత్వంపై విస్తృత ప్రచారం చేస్తారు. మగవాళ్ల హక్కుల గురించి తెలియజేయటం, స్ఫూర్తిదాయక మగ జాతి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేయడం మెన్స్ డే ప్రాథమిక లక్ష్యాలు.


అన్నింటికీ మించి మగాళ్లంటే దుర్మార్థులు అనే భావనని రూపుమాపటం మెన్స్ ప్రధాన ఉద్దేశం. మరి ఈ తతంగం అంతా ఎవరు నిర్వహించాలి అనేది పెద్ద క్వశ్చన్. మెన్స్ డే ను ఐక్యరాజ్య సమితి ఆమోద ముద్ర వేసింది. యునెస్కో సహకారంతో కొన్ని దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు.. మరి కొన్ని దేశాల్లో ఆయా ప్రభుత్వాలే అధికారికంగా మెన్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నాయి.


పురుషుల దినోత్సవంపై మొదటి నుంచి నిర్లక్ష్యం ఉంది. చాలా కొద్ది మందికి మాత్రమే మెన్స్ డే ఉందని.. నవంబర్ 19వ తేదీన పురుషుల దినోత్సవం అని తెలుసు. మహిళా దినోత్సవానికి చేసినంత హడావిడి.. హంగామా మెన్స్ డే రోజు కనిపించదు. ప్రత్యేకించి సెలవు అంటూ ఏమీ లేదు. ఎలాంటి ఆఫర్స్ కూడా ఉండవు.. ఎందుకో తెలుసా.. మగాడి జీవితం తన కోసం కాకుండా.. తన అనుకున్న తన కుటుంబం కోసం బతుకుతాడు కదా.. అందుకే మెన్స్ డే పెద్దగా ఎవరికీ పట్టింపు ఉండదు.. అసలు మగ్రాడికే ఈ విషయం తెలియకపోవటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *