కరోనా కల్లోలం.. ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కరోనాపై ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ సహా పలు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ భేటీలో మోదీ కీలక విషయాలపై చర్చించారు. కరోనా ఇంకా అంతం కాలేదని, బహిరంగ ప్రదేశాల్లో, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ ఆదేశించారు. పండగల సందర్భంగా మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకలు అందుబాటులో ఉంచాలని అన్నారు. అవసరమైన మందులు, ధరలపై పర్యవేక్షించాలని అధికారలకు ప్రధాని సూచించారు. కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేయాలన్న ప్రధాని, కరోనా కేసుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని, కరోనా ప్రికాషన్ డోసులను ప్రోత్సహించాలని చెప్పారు.