పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం: షాద్‌నగర్‌లో ఇంధన కొరత, బంక్‌ల వద్ద భారీ క్యూలు
Shadnagar – పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం తెలంగాణలో కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఏర్పడింది.
పట్టణంలోని అనేక పెట్రోల్ బంకులు మూతపడగా, ప్రస్తుతం కొత్తపేట రోడ్డులోని ఒక్క బంక్‌లో మాత్రమే ఇంధనం లభిస్తోంది. దీంతో ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు సహా వాహనదారులు భారీగా అక్కడికి చేరుకొని బారులు తీరుతున్నారు.
ఇంధనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు డీజిల్ అందక పంటలకు నీరందించడంలో ఇబ్బందులు పడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంధన కొరత కారణంగా సాధారణ జీవన విధానం కూడా ప్రభావితమవుతోంది. వెంటనే సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
ఇదే పరిస్థితి Karimnagar జిల్లాలో కూడా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో పట్టణంలోని కొన్ని బంకులు మూతపడ్డాయి. పద్మనగర్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ నాలుగు రోజులుగా మూసివేయబడటంతో వాహనదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
పలు ప్రాంతాల్లో ఇంధన సరఫరా అంతరాయం ఏర్పడటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.
