మండుటెండలు ముంచెత్తనున్నాయి.. 45°C వరకు ఉష్ణోగ్రతలు! జాగ్రత్తలు తప్పనిసరి
రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదై, కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మండే ఎండల్లో ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోవడం చాలా అవసరం.
🔆 ఎండల్లో చేయాల్సినవి
దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలి
బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి
ఓఆర్ఎస్, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలి
పుచ్చకాయ, కర్బూజా, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినాలి
ఇంట్లో గాలి సరిగా వచ్చేలా కిటికీలు తెరిచి ఉంచాలి
🚫 చేయకూడనివి
మధ్యాహ్నం వేళల్లో కష్టమైన పనులు చేయకూడదు
ఖాళీ కడుపుతో, చెప్పులు లేకుండా బయటకు వెళ్లొద్దు
ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం తగ్గించాలి (డీహైడ్రేషన్‌కు కారణం అవుతాయి)
ఎక్కువ మసాలా, నూనె పదార్థాలు, మాంసాహారం తగ్గించాలి
⚠️ ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
వడదెబ్బ (హీట్ స్ట్రోక్) తగిలిన సంకేతాలు ఇవి:
తీవ్రమైన తలనొప్పి
వాంతులు
అలసట, బలహీనత
కళ్లు తిరగడం
స్పృహ కోల్పోవడం
శరీర ఉష్ణోగ్రత104°F కంటే ఎక్కువగా ఉంటుంది
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.
👉 మండుటెండల సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
