“కార్మికుల సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది”
మే డే సందర్భంగా మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, గతంలో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదని గుర్తుచేశారు. పని గంటలు ఎక్కువగా ఉండేవి, కనీస వేతనాలు కూడా అణిచివేతకు అవసరమయ్యేవారని అన్నారు. అలాంటి సమయంలో అప్పటి కార్మిక నాయకులు పోరాటాలు చేసి హక్కులను సాధించారని వివరించారు.
తన తండ్రి కాకా వెంకట్ స్వామి కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, యాజమాన్యాలు మరియు కార్మికులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని చెప్పారు.
దేశం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా కార్మికులకు ఆధునిక శిక్షణ అందించడం కీలకమని అన్నారు.
రాష్ట్రంలో కోట్ల రూపాయల వ్యయంతో 120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCలు) ఏర్పాటు చేసి, సుమారు 20,000 మంది యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా కార్మికుల పిల్లలకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన కోర్సులను కూడా ప్రవేశపెట్టి ఉత్పత్తి పెంపునకు సహకరిస్తున్నామని వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖకు రూ. 90 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. యువతకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా శిక్షణ ఇచ్చి, జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
నిర్మాణ కార్మికుల బీమా పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు. హమాలీలకు కూడా మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్గాలకు భద్రత కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని ఆమోదించిందని చెప్పారు.
అదేవిధంగా, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, ఈ సేవలను మరింత విస్తృతంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివరించారు.
