సీఎం విజయ్‌కు Z+ భద్రత
కేంద్రం కీలక నిర్ణయం.. ఇక 24 గంటలు కట్టుదిట్టమైన సెక్యూరిటీ
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత Joseph Vijay కు కేంద్ర ప్రభుత్వం Z+ కేటగిరీ భద్రత కల్పించింది. సోమవారం ఉదయం నుంచి ఈ భద్రత అమల్లోకి వచ్చింది. ఇకపై విజయ్ భద్రతను 24 గంటల పాటు కేంద్ర భద్రతా దళాలు పర్యవేక్షించనున్నాయి.
Z+ సెక్యూరిటీలో భాగంగా మొత్తం 55 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వీరిలో 10 మందికి పైగా NSG కమాండోలు ఉండగా.. CRPF, CISF, ITBP సిబ్బంది కూడా భద్రతలో భాగమవుతారు. అత్యాధునిక MP5 రైఫిళ్లతో కమాండోలు నిరంతరం పహారా కాస్తారు. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, పైలట్ కార్లు కూడా ఈ భద్రతా వ్యవస్థలో ఉంటాయి.
దేశంలో అత్యున్నత స్థాయి VIP భద్రతల్లో Z+ ఒకటి. తీవ్రవాద ముప్పు లేదా అధిక రిస్క్ ఉన్న ప్రముఖులకు కేంద్ర హోంశాఖ ఈ భద్రత కల్పిస్తుంది. ప్రధానమంత్రి తర్వాత అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వర్గాల్లో ఇది ఒకటిగా పరిగణిస్తారు.
తమిళనాడులో దాదాపు 60 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే కాకుండా మరో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయం సాధించగా.. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ చేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్లో మరో తొమ్మిది మంది మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టారు.
