హనుమాన్ జయంతి రోజు ఏ రాశివారు ఏ దానం చేస్తే మంచిది?
బజరంగ్బలి ఆశీస్సుల కోసం జ్యోతిష్య సూచనలు ఇవే!
హనుమాన్ జయంతి రోజున భక్తులు ఉపవాసాలు, హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పఠనం చేస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశికి అనుగుణంగా కొన్ని వస్తువులు దానం చేస్తే అడ్డంకులు తొలగి, ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం.
ఏ రాశివారు ఏం దానం చేయాలి?
- మేష రాశి: ఎరుపు రంగు పండ్లు, గోధుమలు, టమాటాలు దానం చేయాలి. దీని వల్ల శక్తి, ఉత్సాహం పెరుగుతాయని విశ్వాసం.
- వృషభ రాశి: పాలు, పెరుగు, బియ్యం, పిండి పదార్థాలు దానం చేయడం శుభప్రదం.
- మిథున రాశి: పచ్చ కూరగాయలు, పండ్లు, పెసర్లు దానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతారు.
- కర్కాటక రాశి: బియ్యం, కొబ్బరికాయ, చక్కెర దానం చేయాలి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుందని నమ్మకం.
- సింహ రాశి: పసుపు స్వీట్లు, బూందీ లడ్డూలు లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
- కన్య రాశి: తీపి అన్నం, పుస్తకాలు లేదా విద్యాసంబంధిత వస్తువులు దానం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు.
- తుల రాశి: రవ్వ హల్వా, వస్త్రాలు దానం చేస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుందని నమ్మకం.
- వృశ్చిక రాశి: పాలు, కీర్, ఎరుపు వస్తువులు దానం చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
- ధనుస్సు రాశి: శనగపిండి హల్వా, పసుపు వస్త్రాలు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
- మకర రాశి: నూనె, నల్ల దుస్తులు, గులాబ్ జామున్ దానం చేయడం శనిదోష నివారణకు ఉపకరిస్తుందని అంటారు.
- కుంభ రాశి: ఆవ నూనె దీపం వెలిగించి పేదలకు తీపి పదార్థాలు పంచితే మంచిదని సూచిస్తున్నారు.
- మీన రాశి: అరటిపండ్లు, బూందీ లడ్డూలు, ఎర్ర జెండా దానం చేయడం శుభప్రదమని భావిస్తున్నారు.
హనుమాన్ జయంతి రోజున దానం చేయడం ద్వారా భయం, అడ్డంకులు తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, రక్షణ లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
