ఏపీలో మరో భారీ ఎన్ కౌంటర్!

1a89220e 8a87 4fbe 897f 114801de2ad4

అమరావతి:నవంబర్ 19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది, బుధవారం తెల్లవారు జామున భద్రతా బలగాలు, మావోయిస్టుల కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు చనిపోయి నట్లు తెలుస్తోందని ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా వెల్లడించారు.

మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిద న్నారు. ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు ఆజాద్,దేవ్ జీ, మృతి చెందినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఏడీజీ పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్ని స్తున్నారు. పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నాం. నవంబరు 17న ఒక ఆపరేషన్‌ లాంచ్‌ చేశాం. 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావో యిస్టులు హతమయ్యారు.

మరోవైపు ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేశాం. వీరిలో స్పెషల్ జోనల్‌ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్‌ మెంబర్లు 23 మంది, డివిజినల్‌ కమిటీ మెంబర్స్‌ 5, ఏరియా కమిటీ మెంబర్స్‌ 19 మంది ఉన్నారు. ప్రజలకు ఎక్కడా హానీ జరగకుండా ఈ అరెస్టులు చేశాం. దొరికిన మావోయిస్టుల నుంచి భారీ గా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నమన్నారు..

మంగళవారం మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారు. వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి’’ అని ఏడీజీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *