ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం (నవంబరు 24) తుదిశ్వాస విడిచారు.గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో (Respiratory issues) బాధపడుతున్నారు.అక్టోబరు 31న అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.గతంలో రొటీన్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లామని, ఆరోగ్యం నిలకడగా ఉందని హేమ మాలిని, సన్నీ డియోల్ తెలిపినప్పటికీ.. నేడు ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు.

