తెలంగాణ అమ్మాయి పసిడి పంచ్👊

whatsapp image 2025 11 21 at 4.48.07 pm

హైదరాబాద్:నవంబర్ 21
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది. మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్‌ గెలిచిన తీరు చూసిన అభిమానులు గర్వంగా ఉప్పొంగిపోయారు. ఫైనల్​లో చైనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్పై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

తొలి రౌండ్ నుంచి నిఖత్ దూకుడే కనిపించింది. ప్రత్యర్థి ప్రయత్నాలను ఒక్కోసారి పంచ్‌లతో అదరగొడుతూ, నైపుణ్యాన్ని సమపాళ్లలో ప్రదర్శించింది. ముగింపు వరకు అదే ఆత్మవిశ్వాసం కొనసాగించడంతో విజయం నిఖత్‌ ఖాతాలో పడింది. ఇటీవల ప్రపంచ ఛాంపి యన్‌షిప్‌లో క్వార్టర్స్‌లో పరాజయం పొందిన నిఖత్‌కు ఈ విజయం ఎంతో కీలకం. ఆ ఓటమిని పక్కనబెట్టి, కొత్త జోష్‌తో తిరిగి గాడిలో పడినట్లు ఈ స్వర్ణం చెబుతోంది.

నిఖత్‌తో పాటు మరికొంత మంది భారత బాక్సర్లు కూడా తమ తమ విభాగాల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియా అద్భుత ప్రదర్శనతో చైనీస్ తైపీ స్టార్, పారిస్ కాంస్య పతక విజేత వుయీను తేలిగ్గా ఓడించింది. రింగ్‌లో జైస్మిన్ వేసిన కౌంటర్ పంచ్‌లు ప్రత్యర్థిని కంగుతినిపించా యి.

60 కేజీల్లో పర్వీన్ హుడా జపాన్ బాక్సర్ తగుచి అయాకాపై ఆధిపత్యం చాటింది. మూడు రౌండ్లపా టు కొనసాగిన ఈ పోరులో పర్వీన్ ఒక క్షణం కూడా వెనక్కి తగ్గకుండా దూకు డును కొనసాగించింది.80 కేజీల్లో నుపుర్ షెరోన్ ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సొటిమ్‌బొయెవాపై గెలిచి స్వర్ణం సాధించింది.

70 కేజీల్లో అరుంధతి చౌదరి ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్ అజీజాను ఓడించింది. తన పవర్, స్పూర్తితో రింగ్‌లో ఆధిపత్యం చాటింది. 54 కేజీల్లో ప్రీతి పన్వర్ ఇటలీ బాక్సర్ సిరిన్ను ఓడించి మరో పసిడిని భారత్‌కు అందించింది. 48 కేజీల్లో మీనాక్షి హుడా ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్ ఫోజిలివాపై గెలిచి మరో స్వర్ణం ఖాతాలో వేసింది.

పురుషుల విభాగంలో కూడా భారత్ మెరుపులు
మహిళా బాక్సర్లతో పాటు పురుష బాక్సర్లు కూడా అద్భుత ప్రదర్శనతో రెండు పసిడి పతకాలు గెలిచారు. 70 కేజీల ఫైనల్‌లో హితేశ్ గులియా కజకిస్థాన్ బాక్సర్ నార్‌బెక్పై విజయం సాధించాడు. 60 కేజీల్లో సచిన్ సివాచ్ కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన మునార్‌బెక్ను ఓడించి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ విజయాలతో భారత బాక్సింగ్ దళం మొత్తం 9 స్వర్ణాలు కైవసం చేసుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *