ప్ర‌జా పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టారు

సిఎం రేవంత్ రెడ్డి కార్య‌దీక్ష‌కు జూబ్లీహిల్స్ ఫ‌లితం నిలువుటద్దం

స‌మిష్టికృషితో స‌త్ఫ‌లితాలు సాధించాం

విజేత న‌వీన్ యాద‌వ్‌కు అభినంద‌న‌లు

హైద‌రాబాద్ :- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు సంపూర్ణ విశ్వాసం ఉంచార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.

అబ‌ద్దాలు, అవాస్త‌వాలు, విష‌ప్ర‌చారాలు చేసిన పార్టీల‌కు జూబ్లీహిల్స్ ఓట‌ర్లు క‌ర్రుకాల్చి వాత‌పెట్టార‌ని అన్నారు.

ఇప్ప‌టికైనా ప్ర‌జాతీర్పును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని త‌మ నోటికి తాళం వేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

   ఈమేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి విజేత న‌వీన్ యాద‌వ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. 

గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గారి కార్య‌ద‌క్ష‌త‌కు ఈ ఫ‌లితం ఒక రెఫ‌రెండ‌మ్‌గా నిలిచింద‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని జూబ్లీహిల్స్ ప్ర‌జ‌ల సేవ‌లో నిమ‌గ్నం కావాల‌ని ఇందుకు ప్ర‌భుత్వం త‌ర‌పున అన్నివేళ‌లా స‌హాకారం ఉంటుంద‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను వీలైనంత త్వ‌ర‌గా నెర‌వేరుస్తామ‌ని అన్నారు.

ముఖ్యంగా తాను ఇన్‌ఛార్జిగా వ్య‌వ‌హ‌రించిన రెహ్మ‌త్ న‌గ‌ర్ డివిజ‌న్‌లో అత్య‌ధిక మెజార్టీ కాంగ్రెస్ కి రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.

అసెంబ్లీ , పార్ల‌మెంట్, కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫ‌లితాలే పున‌రావృత‌మ‌వుతాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *