హైదరాబాద్:నవంబర్ 19
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయితీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసీ, షెడ్యూల్ ప్రకటించింది
రేపటి నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాను సవరించాలని నిర్ణయించింది.. రేపు 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల తప్పుల సవరణ 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం 23న తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది…
ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు.

