అంబర్‌పేటను క్రైమ్, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
హైదరాబాద్, అక్టోబర్ 5: అంబర్‌పేట నియోజకవర్గాన్ని క్రైమ్, డ్రగ్స్ రహిత ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు.
బాగ్ అంబర్‌పేటలోని సాయిబాబానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలు, ఇతర నేరాలను అరికట్టడంతో పాటు గంజాయి, డ్రగ్స్ ముఠాల కార్యకలాపాలపై నిఘా పెంచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
నియోజకవర్గంలో నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన డీ-కోర్ట్ సంస్థతో పాటు సీఐ కిరణ్‌కుమార్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
